Tirumala:టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు

15
- Advertisement -

తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు చైర్మన్.

శ్రీవారి ఆలయంలో దర్శన క్యూలైన్లు పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తులతో మర్యాదగా, సేవాభావంతో ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. రానున్న వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని‌ అదేశించారు.

Also Read:పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ..

మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు అయింది. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. టీటీడీ పాలక మండలి సభ్యుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.

- Advertisement -