మే నెలాఖరు నుంచి రైతుబంధు చెక్కులను అందజేస్తామని చెప్పారు ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు. ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల చెక్కులు ఇవ్వలేక పోయామాని స్పష్టం చేశారు. రైతుబంధు పథకం నిధులను ఆన్‌లైన్ ద్వారా రైతులకు చెల్లిస్తామని, వారికి ఇబ్బంది లేకుండా రుణమాఫీని అమలు చేస్తున్నామన్నారు. మే నెలాఖరు నుంచి జూన్ మొదటి వారం వరకు రైతుబంధు సాయం పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు.
రైతుబంధు చెల్లింపులో బకాయిలు లేవని, 52 ల క్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధిపొందారన్నారు. రైతుబంధు కోసం రబీ సీజన్‌లో రూ.5, 200 కోట్లు నిధులను విడుదల చేశామన్నారు. పింఛన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 23 వ తేదీ తరువాత రైతుబంధు విడుదల చేస్తామనాని, ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని చెల్లింపుల్లో జా ప్యం జరిగిందన్నారు.- రుణమాఫీ కోసం బడ్జెట్‌లో నిధు లు రూ.6,000 కోట్లను కేటాయించామని వాటిని కూడా విడుదల చేస్తామన్నారు.