ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసా?

146
Evms

ఈనెల 19వ తేదితో దేశంలో 7విడదల ఎన్నికలు పూర్తయ్యాయి. అదే సాయంత్రం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ను కూడా విడుదల చేశాయి పలు సర్వేలు. ఇక రేపు వెలువడే ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాజకీయ నేతలు, ప్రజలు. రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. మొదటగా బ్యాలెట్ పత్రాలను లెక్కించనున్నారు. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఇక ఓట్ల లెక్కింపుకు ఓ ప్రత్యేక పద్దతి ఉంటుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమయినా అంతకు ముందు రెండు గంటల ముందు నుంచే ఏర్పాట్లను ప్రారంభిస్తారు. సరిగ్గా 5 గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ కేటాయిస్తారు అధికారులు. తరువాత సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం చేయిస్తారు.

ఉదయం 8గంటలకు పొస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ ఓట్లు ఎక్కువ వుండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. ఒక నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్ లు లేక్కిస్తారని సమాచారం. అదేవిధంగా దాదాపుగా శాసనసభ నియోజకవర్గానికి 2 వేలు, లోక్ సభ నియోజకవర్గానికి 14 వేల వరకూ ఉంటాయి. ఒక్కో రౌండ్ ను లెక్కించడానికి దాదాపు అరగంట సమయం పడుతుంది. 14-15 టేబుళ్ళ పై లెక్కింపు జరుగుతుంది.

ఒకసారి మొత్తం టేబుళ్ళ పై ఉన్న ఈవీఎం ల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టు. పీవీ స్లిప్పులు ఇలా..ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తరువాత పీవీ స్లిప్పుల లెక్కింపు మొదలవుతుంది. ముందుగా దీని కోసం ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్యలను చీటీల పై రాసి వాటిని లాటరీ తీస్తారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయే సరికే అనధికారికంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసిపోతుంది. కానీ, పీవీ స్లిప్పుల లెక్కింపు పూర్తయ్యే దాకా అధికారికంగా ప్రకటించరు. తుది ఫలితాలు వెలువడిన తర్వాతే అధికారికంగా ప్రకటిస్తారు.