- Advertisement -
దేశంలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీకి కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. ఒక్కో డోస్ ధర రూ. 995 కాగా దీన్ని రెండు నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేసే అవకాశం ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ కాగా, మొదటి డోసు ఇచ్చిన 21వ రోజున రెండో డోసు ఇవ్వనుండగా.. 28 నుంచి 42 రోజుల మధ్యలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని ఆర్‌డీఐఎఫ్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో రష్యా నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు హైదరాబాద్ చేరాయి. రెండో విడుతలో 1.50లక్షల డోసులు ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. వాటిని నేరుగా రెడ్డీస్ ల్యాబ్‌కు తరలించారు. జూన్ నుంచి దేశంలోనే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు రెడ్డీస్ ల్యాబ్ ఇప్పటికే ప్రకటించింది. టీకాను రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది.
- Advertisement -