దేశంలో 24 గంటల్లో 3,11,170 కరోనా కేసులు..

72
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,11,170 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 4077 మంది ప్రాణాలు కొల్పోయారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,46,84,077 కు చేరగా.. ఇప్పటివరకు 2,07,95,335 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులుండగా వైరస్‌తో ఇప్పటివరకు 2,70,284 మంది ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 18,22,20,164 డోసులు వేయగా ఇప్పటి వరకు 31.48 కోట్లు టెస్టులు చేసినట్లు తెలిపింది వైద్య శాఖ.