ప్చ్.. తమన్నాతో విసిగిపోయాడా?

36
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య కుచ్ కుచ్ అంటూ ఆ మధ్య పుకార్లు చెలరేగాయి. వెంటనే తమన్నా ‘ఖండించింది’. కానీ, ఆ ఖండనలో నిజమేనేమో అనే అనుమానం రేకెత్తింది. ఆ తర్వాత విజయ్ వర్మ కూడా అదంతా ఉత్తిదే అని చెప్పారు. ఆ మధ్య ఓ హిందీ టాక్ షోకి వెళ్ళినప్పుడు విజయ్ వర్మకి తమన్నాతో మేటర్ ఏంటనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు కూడా విజయ్ వర్మ ఏం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఐతే ఉన్నట్టుండి, తమన్నా మళ్ళీ వివరణల కార్యక్రమం మొదలుపెట్టింది. అసలు విజయ్ వర్మ – తమన్నా డేటింగ్ విషయం పాతబడింది. విజయ్ వర్మ వివరణతో అందరూ దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు తమన్నా మళ్ళీ ఎక్కువ క్లారిఫికేషన్లు ఇస్తుండడంతో వీరి విషయం మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చింది. విజయ్ వర్మతో ప్రేమ విషయంలో తమన్నా లేటెస్ట్ క్లారిఫికేషన్స్ అనేక డౌట్స్ వస్తున్నాయి.

ఐతే, మరోపక్క విజయ్ వర్మ ఈ మధ్య తమన్నాని దూరం పెట్టాడు అని కొందరు అంటున్నారు. తమన్నా కాస్త కమర్షియల్ గా ఉంటుంది. విజయ్ వర్మ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది గానీ, తమ ప్రేమను నెక్స్ట్ స్టేజ్ కి తీసుకువెళ్ళడానికి తమన్నా పెద్దగా ఇష్ట పడటం లేదట. ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడే పెళ్లి ఎందుకు అంటుందట. దాంతో విజయ్ వర్మ విసిగిపోయాడు అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -