ప్రభాస్‌ – అనుష్క పెళ్లి..మళ్లీ రూమర్లు

19
- Advertisement -

జేజమ్మ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ అనుష్క శెట్టి తన పెళ్లిపై స్పందించారు. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘వివాహ వ్య‌వ‌స్థ‌పై నాకు నమ్మకం ఉంది. పెళ్లికి నేను ఎప్పుడూ వ్య‌తిరేకం కాదు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు పెళ్లి చేసుకుంటా.’ అని అనుష్క శెట్టి చెప్పుకొచ్చారు. మరోవైపు నవీన్‌ పొలిశెట్టి ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’లో అనుష్క శెట్టి చెఫ్‌ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో తనకు ఇష్టమైన వంటకం తయారీ విధానాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేసిన అనుష్క ..#MSMPRecipeChallenge పేరుతో ఓ కొత్త ఛాలెంజ్‌కు తెరతీసింది. మొదట దీన్ని ప్రభాస్‌కు విసిరింది.

దీంతో ప్రభాస్‌ – అనుష్క శెట్టి పెళ్లి పై మళ్లీ రూమర్లు మొదలయ్యాయి. చాలా కాలంగా అనుష్క.. హీరో ప్రభాస్ తో ప్రేమలో ఉందని, వారిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని.. కాకపోతే వీరి ప్రేమ విషయంలో ప్రభాస్ తల్లి బాగా అసంతృప్తిగా ఉన్నారని.. అనుష్కతో ప్రభాస్ పెళ్ళికి కూడా ఆమె అభ్యంతరం చెబుతూ వస్తున్నారని.. అందుకే ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోకుండా ఉండి పోయారని ఇప్పటికే రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.

Also Read:మెంతుల వల్ల ఎన్ని ప్రయోజనాలో..!

ఈ క్రమంలో అనుష్క శెట్టి, ప్రభాస్‌ కి ఛాలెంజ్ విసరడంతో మళ్లీ వీరి పెళ్లి పై వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అనుష్క కూడా ప్రభాస్ కోసం వెయిట్ చేస్తోందని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ – అనుష్క ప్రేమ గురించి అందరికీ తెలిసినా.. వారు మాత్రం ఎప్పుడూ బయట పడలేదు. ఇక ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ రేపు విడుదల కానుంది.

Also Read:జీ20 సమ్మిట్‌కు బైడెన్!

- Advertisement -