కే‌సి‌ఆర్ దీక్షా దక్షతకు 13 ఏళ్ళు !

144
- Advertisement -

తెలంగాణలో డిసెంబర్ 9 ఒక ప్రత్యేకమైన రొజూ అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజల ప్రతి రక్తపు బొట్టు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎదురు చూసింది. అలాంటి సమయంలో రాష్ట్ర సాధనకై ఉధ్యమానికి ఊపిరినిచ్చి ” తెలంగాణ వచ్చుడో.. కే‌సి‌ఆర్ సచ్చుడో ” అనే నినాదంతో ప్రాణాలను సైతం పెట్టి, కేంద్రం మెడలు వంచి, రాష్ట్ర సాధనకు నాంది పలికిన కే‌సి‌ఆర్ ఉద్యమానికి నేటితో 13 ఏళ్ళు. రాష్ట్రం సాధించే వరకు వెనక్కి తగ్గే పసక్తే లేదని.. ఈ క్రమంలో తన ప్రాణాలు నిరభ్యంతరంగా ఇచ్చేస్తానని ధీక్ష ధక్షుడు కే‌సి‌ఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష.. అప్పట్లో పెను ప్రకంపనలే సృష్టించింది. .

ఓ వైపు కే‌సి‌ఆర్ ఆరోగ్యం రొజూ రోజుకు క్షీణిస్తుండడం.. మరోవైపు తమ నాయకుడికి మద్దతుగా తెలంగాణ ప్రజలు ఉద్యమాన్ని ఉగ్రరూపంలోకి తీసుకెళ్ళడంతో అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపింది. ఆ తరువాత కే‌సి‌ఆర్ తన నిరంకుశ ధీక్షను నిమ్మరసం సేవించి విరమించారు. 2009 డిసెంబర్ 9 న తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చినప్పటికి, 2014 జూన్ 2 న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా పురుడు పోసుకుంది. అయితే ఇలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడంలో కే‌సి‌ఆర్ పట్టుదల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధ్యమిస్తున్నప్పటికి, కేంద్ర ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లుగాట్లుగానే వ్యవహరిస్తూ వచ్చింది.

అలాంటి సమయంలో 2009 నవంబర్ 29న కే‌సి‌ఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనారు. మొదట్లో కే‌సి‌ఆర్ దీక్షను లైట్ తీసుకున్న అప్పటి యూపీఏ ప్రభుత్వం.. తెలంగాణ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. తన నాయకుడికి మద్దతుగా వందల మంది తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఓవైపు తెలంగాణ అంతటా ప్రత్యక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే మరోవైపు కే‌సి‌ఆర్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఉద్యమాగ్రహం కట్టలు తెంచుకుంది.రాష్త్ర వ్యప్తంగా అప్పుడు జరిగిన ఉద్యమం పెన ప్రకంపనలే రేపింది. దాంతో పరిస్థితి మరింత చేయి దాటిపోతుండడంతో కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక రాష్త్ర ఏర్పాటుకు డిసెంబర్ 9,2009 న ప్రకటన జారీ చేసింది. ఏది ఏమైనప్పటికి తెలంగాణ రాష్త్ర సాధనకు కే‌సి‌ఆర్ చూపిన పోరాట పటిమ, ధీక్ష దక్షత లు ప్రత్యేక రాష్ట్రనికి జీవం పోశాయి అనేది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చెరిగిపోని వాస్తవం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -