నటి పెళ్లి.. మళ్లీ పుకార్ల పరంపర

216
- Advertisement -

తన భర్త చనిపోయాక నటి సురేఖా వాణి పెళ్లి చేసుకోబోతోదంటూ ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ పుకార్లు విని సురేఖా వాణి కూడా విసుగెత్తిపోయింది. అయితే, తన పెళ్లిపై చిన్నపాటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది సురేఖా వాణి. తన పెళ్లిపై జనాలు ఆల్రెడీ చాలా అనేసుకున్నారని, ఇప్పుడు తను కొత్తగా చెప్పేదేం లేదంటోంది.

సురేఖా వాణి తన సన్నిహితుల దగ్గర ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు నా పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు విన్నారు. నెటిజన్లు కూడా వందల రకాలుగా నా పెళ్లి వార్తలను వాళ్లకు వాళ్లే చెప్పుకున్నారు. తమ మైండ్ లో అనిపించిన బొమ్మలకు వాళ్లకు వాళ్లే కామెంట్స్ కూడా రాసేసుకున్నారు’ అంటూ సురేఖా వాణి వ్యగ్యంగా మాట్లాడిందట. నిజంగా సురేఖా వాణి పెళ్లికి రెడీ అయి, ఎవరైనా వ్యక్తి పేరు చెబితే అసలు ట్రోలర్స్ ఊరుకుంటారా ?

అంతెందుకు, నెటిజన్లు తట్టుకోగలరా ?. అందరూ కలిసి సురేఖా వాణి పై ట్రోలింగ్ చేయడానికి నానా పాట్లు పడతారు. అందుకే, తన పెళ్లి పై కామెంట్స్ చేసే వారిని నేను డిసప్పాయింట్ చేయను. వాళ్ళ ఊహలకు తను సపోర్ట్ చేస్తున్నట్లు సురేఖా వాణి తెలివిగా రియాక్ట్ అయింది. అయినా, ఒకవేళ సురేఖా వాణి పెళ్లి చేసుకుంటే.. చెప్పే చేసుకుంటుంది కదా. ఒకవేళ చెప్పకపోయినా, తర్వాత అయినా నిజం తెలుస్తోంది కదా. మరి ఈ లోపే ఎందుకు ఈ పుకార్ల పరంపర.

ఇవి కూడా చదవండి..

- Advertisement -