హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన అందం అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ అమ్మడు పలు తెలుగులో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో ప్రతి విషయాన్నీ షేర్ చేసుకునే అనుపమ గత కొన్ని రోజులుగా బాధలో మునిగిపోయిందట. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా లేదు. దీనితో అనుపమకు ఏమైందోనని అందరూ అనుకున్నారు. అయితే ఈ విషయంపై ఈ అమ్మడు తాజా స్పందిస్తూ ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.
తాను ఇష్టంగా పెంచుకొన్న రెండు పెంపుడు కుక్కలను కాపాడుకోలేకపోయాననే బాధను వ్యక్తం చేస్తూ అనుపమ వీడియోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా మాములు మనిషి కావడానికి ప్రయత్నించినా.. కానీ నా వల్ల కాలేదంటూ తన పెంపుడు కుక్కల విషాదం గురించి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వెల్లడించింది.
తన పెంపుడు కుక్కల మరణం గురించి మాట్లాడుతూ.. పార్వో వైరస్‌తో గురైన విస్కీ, రమ్, టాడీని రక్షించుకోవడానికి ప్రయత్నించాను. కానీ పెంపుడు కుక్కలు రెండు ఆ వ్యాధి బారి నుంచి బయటపడలేకపోయాయి. వాటిని కాపాడుకోలేదన్న బాధ నన్ను వెంటాడుతున్నది అని వీడియోలో తన బాధను పంచుకొన్నారు. ప్రస్తుతం అనుపమ తమిళ,మలయాళ చిత్రాల్లో నటిస్తోంది.