సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా కీలక పాత్రలో నటించిన చిత్రం `రుద్రంకోట`. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి ఈ చిత్రాన్ని నిర్మించగా అనిల్, విభీష, రియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కథ :
చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరమైన రుద్రుడు( అనిల్ ఆర్కా) కి అన్నీ ఆ ఊరి పెద్ద కోటమ్మే(జయలలిత). తమ ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే వారిని కఠినంగా శిక్షించడం వీరి నైజం. ఆ ఊర్లో వీరి మాటకి ఎదురుండదు. అమ్మాయిలంటే రుద్రుడికి నచ్చదు. అయితే అతడిని శక్తి(విభీష జాను) గాఢంగా ప్రేమిస్తుంది. ఈ క్రమంలో కోటమ్మ మనవరాలు(అలేఖ్య) ఊరిలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె రుద్రుడి పై మోజు పడుతుంది. సీన్ కట్ చేస్తే శక్తి ప్రేమలో పడతాడు రుద్ర. తర్వాత ఏం జరుగుతుంది..?శక్తి మరణానికి కారణం ఎవరు..? కోటమ్మకి ఉన్న గతమేంటి?. చివరకు కథ ఎలా సుఖాంతం అయిందన్నది తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ జయలలిత నటన. కోటమ్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసింది.తన పాత్రకి వంద శాతం న్యాయం చేసింది. ఇక రుద్రుడుగా అనిల్ ఆర్కా నటన అద్భుతం. కొన్ని సన్నివేశాల్లో అతని పాత్ర ‘కాంతార’ లో రిషబ్ శెట్టిని గుర్తుచేస్తుంది అనడంలో అతిశయోక్తి కాదు. విభిష శక్తి , అలేఖ్య తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అలేఖ్య గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా మిగిలింది. శక్తి, రుద్ర మధ్య వచ్చే సాగే ప్రేమ సన్నివేశాలు బాగున్నాయి. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ సూపర్బ్.
Also Read:చంద్రబాబు కుంభకోణాలు..నిజమేనా?
మైనస్ పాయింట్స్:
సినిమా ప్రారంభమైన కాసేపటికే కథనం నెమ్మదిగా సాగుతుంది. ఇక రోటిన్ సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగియగా డైలాగ్‌లు పేలవంగా ఉండటం మైనస్. కోటమ్మ, రుద్ర పాత్రల నేపథ్యాన్ని ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది.
సాంకేతిక విభాగం:
కోటి నేపథ్య సంగీతం బాగుంది. సుభాష్ ఆనంద్, యువి నిరంజన్.. సంగీతంలో రూపొందిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ కూడా సినిమాకి హైలెట్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీ రంగ డైలాగులు బాగున్నాయి. పల్లెటూరి అందాలను చక్కగా తన కెమెరాలో బందించాడు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
స్త్రీ సృష్టికి మూలం, స్త్రీ తప్పు చేస్తే ఎలాంటి ఘోరాలు జరిగాయో పురాణాల్లో చదువుకున్నాం, చరిత్ర కూడా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంది. ఆధునిక యుగంలో స్త్రీలు ఎలా ఉండాలో అనే పాయింట్‌ని బేస్ చేసుకుని తెరకెక్కించారు దర్శకుడు రాము కోన. క్లైమాక్స్ అందరినీ కట్టి పడేస్తుంది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేయదగ్గ సినిమా ‘రుద్రం కోట’.
Also Read:బీఆర్ఎస్‌లోకి ఏపూరి సోమన్న!
విడుదల తేదీ:22/09/2023
రేటింగ్ : 3/5
నటీనటులు : జయలలిత, అనిల్ ఆర్కా
సంగీతంః సుభాష్ ఆనంద్ నిరంజన్
నిర్మాతః అనిల్ ఆర్కా కండవల్లి
దర్శకత్వంః రాము కోన