చంద్రబాబు కుంభకోణాలు..నిజమేనా?

30
- Advertisement -

టీడీపీ అధినేత చుట్టూ పలు స్కామ్ లు చుట్టిముట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ స్కామ్ లన్నీ ఒట్టివేనని అందులో ఎలాంటి నిజం లేదంటూ టీడీపీ శ్రేణులు చెబుతున్నప్పటికి.. వాటిని నిరూపించాచడంలో మాత్రం టీడీపీ శ్రేణులు వెనుకడుగు వేస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక స్కామ్ లో ఎలాంటి తప్పు చేయకుండా ధోషిగా పరిగణించబడినప్పుడు నిర్ధోషిగా నిరూపించుకునేందుకు తేలికైన విషయమే. ఎందుకంటే ఏ కుంభకోణంలో ధోషిగా పరిగణించారో అందుకు సంబంధించి పూర్తి సమాచారం ప్రజల ముందుంచి చట్టప్రకారం బయట పడవచ్చు. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం అలా జరగడం లేదు..

ఆయన స్కామ్ కు పాల్పడినట్లు పక్కా ఆధారాలతో సీఐడీ రిమాండ్ విధించింది. దీంతో ఆ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికి.. బయటపడే దారి కనిపించడం లేదు అనేది కొందరి వాదన. ఇక చంద్రబాబు పై పెట్టిన కేసులన్నీ కక్ష పూరితమైనవని, వీటిపై అసెంబ్లీలో చర్చించాలని అసెంబ్లీ సమావేశాలకు ముందు టీడీపీ శ్రేణులు వేసుకున్న ప్లాన్. తీర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాక టీడీపీ శ్రేణులు చర్చకు ససేమిరా అనడం గమనార్హం.

Also Read:‘గుంటూరు కారం’ పరిస్థితి ఇదీ!

నిన్న చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేయగా అందుకు వైసీపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. దీంతో ఇవాళ చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరిగే అవకాశం ఉందని భావించారంతా. కానీ ఇవాళ కూడా చర్చకు వైసీపీ సిద్దంగానే ఉన్నప్పటికి టీడీపీ ఎమ్మేల్యేలు సభలో గందరగోళం సృష్టించి సెషన్ మొత్తం సస్పెండ్ అయ్యేలా వ్యవహరించారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు అరెస్ట్ పై చర్చించించేందుకు టీడీపీ శ్రేణులే వెనుకడుగు వేస్తున్నట్లు స్పష్టంగా తేలిపోయింది. దీంతో చంద్రబాబు చుట్టూ అలుముకున్న స్కామ్ లన్నీ నిజమేనా అనే సందేహాలు ఏపీ ప్రజల్లో వ్యక్తమౌతున్నాయి. మరి చివరకు ఈ స్కామ్ లు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.

Also Read:సనాతన ధర్మం అంటే ఇదేనా..మోడీజీ!

- Advertisement -