అకాల వర్షాలు..రైతులను ఆదుకోండి:ఆర్‌ఎస్పీ

2
- Advertisement -

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్ గాం విలేజ్ నెం.7,8 లలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి,రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు బిఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

రాష్ట్రంలో వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయాలి అన్నారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాన 50 వేల రూపాయల ఎక్స్ గ్రెషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి అన్నారు.

సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు పంట నష్టపోయిన రైతుల గురించి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు అన్నారు. ప్రభుత్వం వెంటనే సర్వే చేపట్టి అకాల వర్షాలకు ఇళ్లు,పంటలు కోల్పోయిన వారిని ఆదుకోవాలి అన్నారు.

Also Read:సహజమైన ప్రోటీన్‌లు ఇవే!

- Advertisement -