చండీగఢ్‌లో ఉన్ జేడబ్ల్యూ మారియట్ హోటల్లో నటుడు రాహుల్ బోస్ ఇటీవల రెండు అరటిపళ్లు తిన్నాడు. అయితే ఆ అరటి పళ్లకు హోటల్ వారు వేసిన బిల్లు చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ రెండు అరటిపళ్లకు హోటల్ యాజమాన్యం జీఎస్టీతో కలపి ఏకంగా రూ.442.50 బిల్లు వేసింది. ‘పండ్లు కీడు చేయవని ఎవరు చెప్పారు? ఇదే ఉదాహరణ.’ అంటూ ఆ బిల్లును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది నెట్టింట తెగహల్‌చల్ వైరల్‌గా మారింది. ఆ హోటల్ మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు.
దాంతో హోటల్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుండటంతో మారియట్ యాజమాన్యం కూడా స్పందించింది. దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది. అయితే, ఆ బిల్లును చూసిన ఎక్సైజ్ పన్నుల శాఖ.. అరటి పళ్లకు కూడా జీఎస్టీ వేసినట్టు గుర్తించింది. తాజాగా ఈ అరటిపండ్ల వివాదంలో హోటల్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు.
సీజీఎస్టీలోని సెక్షన్ 11 నిబంధనలను అతిక్రమించి పండ్లను అధిక ధరకు విక్రయించినందుకు గానూ ఆ హోటల్‌కు రూ.25వేలు జరిమానా విధించారు. ఛండీగఢ్ వాణిజ్య పన్నుల శాఖ ఉపకమిషనర్ మణిదీప్ భర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఆ శాఖ సహాయ అధికారి రాజీవ్ చౌదరి హోటల్ యాజమాన్యం నిబంధనలు అతిక్రమించిందని తేల్చడంతో జరిమానా విధించారు.