ట్రాఫిక్ చలాన్ రాయితీ…రూ.140 కోట్లు వసూల్!

90
police
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు మంచి స్పందన వస్తోంది. మార్చి 31వరకు రాయితీతో చలాన్ల చెల్లింపుకు అవకాశం ఉండగా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొస్తున్నారు. ఇప్పటివరకు రూ. 140 కోట్ల జరిమాన వసూలైంది.

ఇంకా 15 రోజులు మాత్రమే గడువు ఉండటంతో మరింత స్పందన వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ నెల నుంచి వాహనాలపై పెండింగ్ చలాన్లు తనిఖీలు చేసి చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు పోలీసులు.

నో మాస్క్ కేసులు 90 శాతం మాఫీకానుండగా టూ,త్రీ విలర్ వాహనాలకు 75 శాతం,ఆర్టీసీకి 70 శాతం మాఫీ చేశారు.

- Advertisement -