- Advertisement -
ఇకపై మెర్సిడెస్ మే బ్యాక్ ఎస్ 650లో ప్రయాణం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సెక్యూరిటీ రిత్యా రేంజ్ రోవర్ నుంచి మెర్సిడెస్ బెంజ్‌కు ప్రధాని కారును అప్‌గ్రేడ్ చేశారు. బుల్లెట్లు, పేలుళ్లు సంభవించినా సురక్షితంగా ఉండేలా ఈ కారును డిజైన్ చేశారు.
ఈ కారు ధర అక్షరాల రూ. 12 కోట్లు. రెండు మీటర్ల దూరంలో 15కేజీల టీఎన్టీ బ్లాస్ట్ జరిగినా.. ప్రొటెక్ట్ చేయగలదు.. అంతే కాకుండా దీని బాడీ డైరక్ట్ ఎక్స్ ప్లోజన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుందని… గ్యాస్ అటాక్ జరిగితే కారులో సపరేట్ ఎయిర్ సప్లై కూడా ఉంటుంది.
అత్యున్నత స్థాయి ప్రముఖులకు భద్రత కల్పించే ఎస్పీజీ ప్రమాణాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క కారును ఆరేళ్లకు మించి ఉపయోగించరాదని కేంద్రం వర్గాలు స్పష్టం చేశాయి.
- Advertisement -