చరణ్‌ నాలో సగ భాగం: ఎన్టీఆర్

25
rrr

రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వం వహించగా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా కేరళలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్…ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన టోవినో బ్రదర్.. ఇకనుంచి మిమ్మల్ని బ్రదర్ అనే పిలుస్తాను.. థాంక్స్ వచ్చినందుకు అని తెలిపారు.

రాజమౌళి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఇక చరణ్ తో నా అనుంబంధం గురించి చెప్పాలంటే.. చరణ్ నాలో సగభాగం.. అది ఎటు సైడ్ అని అడిగితే ఎడమ వైపు భాగం అంటాను.. ఎందుకంటే హార్ట్ అటే ఉంటుంది కాబట్టి అని వెల్లడించారు. ఇదేదో పబ్లిసిటీ స్టంట్ కోసం చెప్పడం లేదని…. దేవుడికి ధన్యవాదాలు తెలిపారు. నా బ్రదర్ చరణ్ తో 200 రోజులు గడిపే క్షణాలు నాకు ఇచ్చినందుకు.. ఈ బంధం కేవలం ‘ఆర్ఆర్ఆర్’ తోనే ముగిసిపోతుంది అని నేను అనుకోవడం లేదన్నారు.