జీరో బ్యాలెన్స్‌ ఎకౌంట్‌ లో 10 వేలు జమ..?

232
Jan Dhan Zero Accounts
- Advertisement -

పెద్ద నోట్ల రద్దు అనే అనూహ్యమైన, సాహసోపేతమైన నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యపరచిన మోదీ సర్కారు.. త్వరలో మరో షాకింగ్‌ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే అది కొందరికి మాత్రమే శుభవార్త. అదేంటంటే.. జీరో బ్యాలెన్స్‌ ఉన్న ప్రతి జన్‌ ధన్‌ ఖాతాలోనూ ప్రభుత్వమే రూ.10 వేలు జమ చేయాలనే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి.. అదే సమయంలో, చేతిలో డబ్బు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పేద ప్రజానీకానికీ ఇద్దరికీ మేలు చేసే చర్య ఇది అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Jan Dhan Zero Accounts

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రజలు తెరిచిన 25 కోట్ల జన్‌ ధన్‌ ఖాతాల్లో 5.8 కోట్ల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. ఆ ఖాతాలన్నిటిలో రూ.10 వేల చొప్పున వేయడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు.. రూ.58 వేల కోట్లు. వినడానికి ‘అమ్మో అంత సొమ్మా’ అనిపించవచ్చుగానీ.. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వానికి రూ.3 లక్షల కోట్ల మేర లబ్ధిని పరిగణనలోకి తీసుకుంటే అది పెద్ద విషయమే కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఆ నిర్ణయం వల్ల కలిగే లాభాలను పేద రైతులు, ఇతర పేదలకు పంపిణీ చేయబోతున్నామనే సంకేతాలను ప్రభుత్వం ఈ చర్య వల్ల ఇవ్వగలుగుతుంది’’ అని వారు విశ్లేషిస్తున్నారు.

Jan Dhan Zero Accounts

నిజానికి బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకులో ఎక్కువ మంది మధ్యతరగతివారు, చిరువ్యాపారులు, వ్యాపారులు ఉంటారు. నోట్ల రద్దు వల్ల ఎక్కువగా ప్రభావితమైన వర్గాలు కూడా ఇవే. కానీ, తాజా పరిణామాలతో ఆ వర్గాల ఆగ్రహం బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. కాబట్టి, జన్‌ ధన్‌ ఖాతాల్లో డబ్బు వేయడం ద్వారా పార్టీకి మళ్లీ ఆ వర్గాల మద్దతు లభిస్తుందని వారు భావిస్తున్నారు. నోట్లరద్దుతో ఇబ్బందుల పాలవుతున్న పేద,మధ్యతరగతి వారికి ఈ విధంగానైనా సాంత్వన కలిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు
ప్రచారం జరుగుతోంది.

- Advertisement -