క్రెడిట్, డెబిట్‌ కార్డుదారులకు తీపి కబురు..

185
creditcards
- Advertisement -

పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా నగదు కొరత ఏర్పడిన విషయం తెలిసింది. నోట్లకష్టాలను తగ్గించేందుకు…దేశాన్ని నగరహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగానే క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదారులకు ఓ శుభవార్త వినిపించింది. పెద్దనోట్ల రద్దు అనంతరం దేశంలో నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలను మళ్లించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.2వేలలోపు జరిపే లావాదేవీలపై సేవాపన్ను ఎత్తివేయాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో నోటిఫికేషన్‌ను ప్రవేశపెట్టనున్నారు.

creditcards

ఇప్పటి వరకు ఇటువంటి మొత్తాలపై 15శాతం సేవాపన్నుగా చెల్లిస్తున్నాం. ఇకపై ఈ మొత్తాలపై పన్ను మినహాయింపు వెసులుబాటును కల్పించనున్నారు. 2012 జూన్‌లో విడుదల చేసిన సేవా పన్ను నోటిఫికేషన్‌ను ఇందుకోసం సవరించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. నగదుకొరతతో ఇబ్బందులు పడుతూ డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడుతున్నవారికి ఇది మరింత ప్రయోజకరంగా వుంటుందని అంచనా! ముంబైలో సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కొత్త రూ.500 నోట్లను అందుబాటులోకి రావడానికి కొంతసమయం పడుతుందని ఆర్ బీఐ తేల్చి చెప్పింది.

కాగా నిన్న (బుధవారం)ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేవారికి ఆర్ బీఐ కొత్త నిబంధనలు విధించింది. ఇకపై రూ.2000 రూపాయల చెల్లింపుల్లో ఎలాంటి ఓటీపీ( వన్ టైమ్ పాస్‌వర్డ్) అవసరంలేదని ఆర్బీఐ తేల్చేసింది. వన్ టైమ్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ ద్వారా కార్డుహోల్డర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించిన సంగతి తెలిసిందే.

- Advertisement -