డబ్బులిస్తే..అవార్డ్స్‌ వచ్చేస్తాయ్

201
Filmfare
- Advertisement -

ఏ రంగంలోనైనా ప్రతిభావంతులనే అవార్డులు వరిస్తాయని అందరు నమ్మే విషయం. కానీ దీనికి వ్యతిరేకంగా డబ్బులిస్తే కూడా ఉత్తమ అవార్డులు వరిస్తాయని సినిమా రంగంలోని ఓ బాలీవుడ్ హీరో రుజువు చేశాడు. అది కూడా జాతీయ స్థాయిలో గొప్పగా భావించే ఫిలింఫేర్ అవార్డు. అవార్డులకు సంబంధించి బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ అలాంటి సంచలన విషయాన్నే వెల్లడించారు. ఇటీవల ఆయన ‘ఖుల్లాం ఖుల్లా’ పేరుతో తన ఆత్మకథను ప్రచురించారు. దీనిపై ఓ ప్రముఖ ఛానెల్ రిషికపూర్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన తాను కూడా ఒకప్పుడు ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డును కొనుక్కున్నానంటూ వెల్లడించారు.

 Filmfare

1973లో ‘బాబీ’ సినిమాతో హీరోగా పరిచయమైన రిషీకపూర్ ఆ మరుసటి ఏడాది ఆ చిత్రానికి ఉత్తమనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ అవార్డును తాను రూ.30,000కు కొనుక్కున్నానని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పట్లో తాను యువకుడినని, చేతిలో బాగా డబ్బులు ఉండేవని తెలిపారు. ఆ డబ్బులతో అవార్డు కొనుక్కున్నానని చెప్పారు. అయితే ఆ తర్వాత తాను చేసిన పనికి సిగ్గుపడ్డానని, మళ్లీ జీవితంలో అలాంటి పని చేయలేదని రిషీ వివరించారు. ఆ తర్వాత వచ్చిన అవార్డ్స్ కూడా అలా గెలుచుకున్నదే అంటే పోరబడినట్టేనని వివరణ ఇచ్చాడు. ఇలా అవార్డ్స్ కొనుక్కోవడమేంటి. డబ్బులుంటే ఉత్తమ అవార్డ్స్ ఇలా కూడా గెలుచుకుంటారని..కొంతమంది సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైన దైర్యంగా ఇలాంటి తప్పును ఒప్పుకోవడం…రిషి కపూర్ గట్స్ ను మెచ్చుకోవాల్సిందే.

- Advertisement -