గతేడాది తెలుగు సినిమా మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సరికొత్త సంచలనాలను సృష్టించిన హీరో విజయ్ ఆంటోని. డా.సలీం, నకిలీ సినిమాలతో విభిన్న చిత్రాల హీరొగా పేరు తెచ్చుకున్న విజయ్ , బిచ్చగాడు తో స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్నారు. ఓ వైపు సంగీత దర్శకుడిగా బిజీగా ఉంటూనే హీరోగా తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న ఆంటోని.. తాజాగా రోషగాడుగా ప్రేక్షకుల ముందుకురానున్నాడు.
హీరోగా,మ్యూజిక్ డైరెక్టర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ బిచ్చగాడుతో నిర్మాతగా మారాడు. అయితే ఇటీవల వరుస పరాజయాలతో డీలా పడ్డ విజయ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం రోషగాడు సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విజయ్…ఇకపై సినిమాలు నిర్మించకూడదనే నిర్ణయానికి వచ్చాడు. ఇకపై చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండి కేవలం నటనపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపారు విజయ్.
ఇటీవల విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు విజయ్. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా హోమ్ బేనర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుండగా మోషన్ టీజర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు.