తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కార్మికుల కోసం కీలకమైన బిల్లును తీసుకువచ్చింది. బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కావడంతో ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టి ముజువాణి ఓటుతో బిల్లు నెగ్గించుకున్నారు. అయితే ఈ బిల్లుపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. ఇంతకి ఈ బిల్లులో ఎముందని అనుకుంటున్నారు.
ఈ బిల్లు ప్రకారం తమిళనాడులోని కార్మికులందరూ రోజుకు12గంటలు పనిచేయాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు ప్రకారం రోజుకు 12గంటల చొప్పున వారంలో 4రోజులు మాత్రమే పనిచేయాలని అన్నారు. అలాగే మిగిలిన రోజులు విశ్రాంత్రి తీసుకోవచ్చని తెలిపారు. మొత్తం పనివేళలు సెలవుల్లో ఎలాంటి మార్పు ఉండదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తంగం తెన్నరసు అన్నారు.
Also Read: సిఎం జగన్ కు ” చెల్లి పోటు “!
తమిళనాడుకు పరిశ్రమలు తరలివస్తున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. కానీ ఎలాగైనా బిల్లును నెగ్గించుకున్న తమిళనాడు ప్రభుత్వం దీన్నిపై పూర్తి స్థాయిలో అమలు జరిగేలా చూస్తారా లేదా అనేది త్వరలో తెలుస్తుందని రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.
Also Read: కర్నాటకలో ఫ్యామిలీ పాలిటిక్స్ !