రాజీవ్ ఖేల్ రత్న రేసులో రోహిత్!

201
rohith
- Advertisement -

క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రేసులో ఉన్న క్రీడాకారులను నామినేట్ చేసింది సెలక్షన్ కమిటీ. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో వీరేంద్ర సెహ్వాగ్, మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లు పాల్గొనగా నలుగురిని ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ చేసింది కమిటీ.

నామినేట్ అయిన వారిలో రోహిత్ శ‌ర్మ‌తో పాటు రెజ్ల‌ర్ వినేవ్ పోగ‌ట్‌, టీటీ ప్లేయ‌ర్ మానికా బ‌త్రా, పారాఒలింపిక్ స్వ‌ర్ణ‌ప‌త‌క విజేత మ‌రియ‌ప్ప‌న్ తంగ‌వేలు ఉన్నారు. అత్యున్న‌త క్రీడా అవార్డుకు న‌లుగురు క్రీడాకారులు నామినేట్ కావ‌డం ఇది రెండ‌వ‌సారి.

ఇప్ప‌టివ‌ర‌కు స‌చిన్‌, ధోనీ, కోహ్లీలు ఈ అవార్డును అందుకోగా ఒకవేళ రోహిత్ ఎన్నికైతే నాలుగో ఆటగాడిగా నిలుస్తాడు. 2016లో ష‌ట్ల‌ర్ పీవీ సింధు,

- Advertisement -