ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా

0
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ అధికారులు మరోసారి షాకిచ్చారు. హర్యానాలో ఓ భూ ఒప్పందం కేసులో భాగంగా వాద్రాకు రెండోసారి సమన్లు పంపించింది ఈడీ. గతంలో ఏప్రిల్ 8న తొలిసారి సమన్లు జారీ చేసింది ఈడీ.

హర్యానాలోని శికోపూర్ గ్రామంలో జరిగిన భూమి కొనుగోళ్లకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మంగళవారం విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. ఈడీ సమన్లు జారీ అయిన తర్వాత వాద్ర తన నివాసం నుంచి ఢిల్లీలోని ఈడీ కార్యలయానికి కాలినడకన వెళ్లారు.

ప్రజలకు ఏదైనా మంచి చేసినప్పుడల్లలా తనను అణచివేయడానికి ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. ఈడీ సమన్లు జారీ చేయడాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థల అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు.

Also Read:కొండగట్టు ఆలయం..రూ.కోటి 67 లక్షల ఆదాయం

- Advertisement -