కరోనాతో కేంద్ర మాజీమంత్రి అజిత్ సింగ్ కన్నుమూత..

77
rld

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు కరోనాతో పలువురు ప్రజాప్రతినిధులు మృతిచెందగా తాజాగా రాష్ట్రీయ‌ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) అధ్యక్షుడు , కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కన్నుమూశారు. కరోనా బారిన ప‌డిన ఆయ‌న గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుప‌త్రిలో చేరి, చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.

ఏప్రిల్ 22 న కరోనా బారిన పడ్డ ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత‌ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు.