కరోనా టీకాల పేటెంట్స్ రద్దు:బైడెన్

145
us
- Advertisement -

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గజగజ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ రూపంలో మహమ్మారి కబలించగా భారత్‌లో ప్రస్తుతం సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది.

ఈ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న వ్యాక్సిన్ల కొరత తీర్చేందుకు ..కరోనా టీకాల పేటెంట్స్ రద్దుకు మద్దతు తెలిపింది అమెరికా ప్రభుత్వం. వ్యాక్సిన్ల మేధో సంపత్తి హక్కులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలు అన్ని రకాల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు లైన్ క్లీయర్ అయింది. అంతేగాదు ఆయా దేశాలు తమ ఫార్ములాను ఇతర దేశాలతో పంచుకోవచ్చు…ఇందుకోసం అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేయనుంది.

- Advertisement -