దేశంలో గత 24 గంటల్లో 3980 మంది మృతి..

65
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి 4 లక్షలు దాటాయి. దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,12,784 కరోనా కేసులు నమోదుకాగా 3980 మంది మృతిచెందారు. క‌రోనా పాజిటివిటీ రేటు 24.8 శాతంగా ఉండగా కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 51,880 కేసులు ఉండ‌గా, క‌ర్ణాట‌క‌లో 50,112 ఉన్నాయి.

కేర‌ళ‌లో 41,953, త‌మిళ‌నాడులో 23,310, ప‌శ్చిమ‌బెంగాల్‌లో 18,102, పంజాబ్‌లో 8,105 న‌మోద‌య్యాయి.అత్యధికంగా మ‌హారాష్ట్ర‌లో 920 మంది మృతిచెందగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 357, క‌ర్ణాట‌క‌లో 346, పంజాబ్‌లో 182, హ‌ర్యానాలో 181, త‌మిళ‌నాడులో 167 మంది మృతిచెందారు.