మాజీ సీఎం జీవిత చరిత్రపై బయోపిక్

385
Lalu Prasad yadav
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అలనాటి హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం భారీ విజయం సాధించడంతో బయోపిక్ లు తెరకెక్కించడానికి దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

కాగా, బీహార్ కు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన లాలూప్రసాద్ యాదవ్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో లాలూప్రసాద్ యాదవ్ పాత్రలో భోజపురి నటుడు యశ్ కుమార్ నటిస్తున్నారు. అలానే రబ్రీదేవి పాత్రలో స్ముతి సిన్హా నటిస్తోంది.

ఈసినిమాకు లాంతర్ అనే టైటిల్ ను ఖారరు చేసినట్లు తెలుస్తుంది. లాలు ప్రసాద్ యాదవ్ పార్టీ గుర్తు లాంతర్ కావడంతో ఈటైటిల్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. వచ్చే ఏడాది బిహార్ లో ఎన్నికలు జరుగుతుండటంతో లాలు బయోపిక్ కూడా అదే సమయంలో విడుదలకానుంది.

- Advertisement -