లాలూకు కిడ్నీ మార్పిడి

193
- Advertisement -

ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్ యాదవ్‌ గత కొన్ని సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. అయితే సింగపూర్ డాక్టర్ల సూచనలతో కిడ్నీ మార్పిడి చేయించుకొవాలని నిర్ణయించారు. దీంతో ఎవరి దగ్గరి నుంచి కిడ్నీని తీసుకోవాలని సందేహం తలేత్తడంతో తన కూతురు అయిన రోహిణి యాదవ్‌ ముందుకు వచ్చారు. మొదట్లో లాలూ వ్యతిరేకించిన డాక్టర్ల సలహాల మేరకు ఒప్పకుంటున్నట్టు జాతీయవార్తాల కథనం. దీంతో ఆయన త్వరలో సింగపూర్ వెళ్లి చికిత్స చేయించుకోబోతున్నారు.

మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకోవాలని ఆయనకు సింగపూర్ వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు ఇచ్చినపుడు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతమవుతున్న సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయని, అందువల్ల తన మూత్రపిండాన్ని తీసుకోవడానికి అంగీకరించాలని రోహిణి ఆయనపై తీవ్రంగా ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఆమె ఒత్తిడితో ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నవంబరు 20-24 మధ్యలో లాలూ సింగపూర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రోహిణి ఒత్తిడితోనే ఆయన సింగపూర్‌ వైద్యులను సంప్రదించారు. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ లో మూత్రపిండాల సమస్యకు చికిత్స చేయించుకుంటున్నారు. కానీ ఎయిమ్స్ వైద్యులు ఆయనకు మూత్రపిండాలను మార్చుకోవాలని సలహా ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి..

పోలీసుల కస్టడీకి ఫౌంహౌస్‌ కేసు నిందితులు..

షర్మిల పాదయాత్ర…దండగే!

అందరి టార్గెట్‌ రేవంతే!

- Advertisement -