జిమ్ చేస్తే.. గుండె పోటు వస్తుందా ?

294
- Advertisement -

ఈ మద్య కాలంలో జిమ్ చేస్తూ గుండెపోటుకు గురౌతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. శారీరక దృఢత్వం కోసం చాలమందికి వ్యాయామం చేసే అలవాటు ఉంటుంది. కొందరూ ఉదయం పూట వ్యాయామం చేయడానికి ఇష్టపడితే.. మరికొందరు సాయంత్రం పూట వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. ఇంకొందరు ఎలాంటి సమయాభావం లేకుండా అధిక సమయం వ్యాయామానికే కేటాయించే వారు కూడా లేకపోలేదు. అయితే ఇలా మితి మీరిన వ్యాయామం కారణంగా ఈ మద్య కాలంలో చాలమంది హార్ట్ ఎటాక్ కు గురి అవుతూ అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే నిజంగానే జిమ్ చేయడం వల్ల గుండె పోటు వస్తుందా ? వ్యాయామం సమయంలో గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటిని ఇప్పుడు తెలుసుకుందాం !

సాధారణంగా ప్రతిరోజూ వ్యాయామం చేసే వారిలో గుండె జబ్బులు కనిపించవు. అయితే వ్యాయామం చేసే సమయంలో శరీరాన్ని అధికంగా కష్టపెట్టడం వల్ల రక్త ప్రసరణ వేగం విపరీతంగా పెరుగుతుంది. అందువల్ల గుండెపై అధిక పనిభారం పడడంతో.. అందులోని ప్లెక్స్ డ్యామేజ్ కు గురి అవుతాయి ఫలితంగా కార్డియాకరెస్ట్ జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు అధికం. జిమ్ లో అధిక బరువులు ఎత్తడం, ఒక్కసారిగా శరీరాన్ని అధిక ఒత్తిడికి గురిచేయడం వంటివి చేస్తే బాడీకి ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల అందువల్ల రక్తనాలల్లో రక్తసరఫరా వేగం పెరిగి నాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఫలితంగా గుండెలో ఎలక్ట్రిక్ షాక్ వెవ్స్ మొదలై గుండె పోటుకు దారితీస్తుంది.

అయితే వ్యాయామం చేసే సమయంలో కొన్ని సూచనలు పాటించడం వల్ల గుండెపోటు లేదా కార్డియాకరెస్ట్ జరగకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా వర్కౌట్స్ చేసే టైమ్ లో శరీరం డీ హైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అందువల్ల తగినంగా నీరు తాగడం మంచిది. ఇక వ్యాయామం చేసే ముందు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కళ్ళు తిరగడం లేదా వికారంగా ఉండడం వంటి సమస్యలు మొదలౌతాయి. కాబట్టి వ్యాయామం చేసే ముందు పౌష్టికాహారం తీసుకోవడం ఉత్తమం. అయితే తిన్న వెంటనే జిమ్ చేయడం ప్రారంభించకూడదు. ముఖ్యంగా జంక్ పుడ్, ఆయిల్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

వ్యాయామం చేసే సమయంలో ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమటలు పడడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -