బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్నారు భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పోటీలో ఆయన చివరి దశకు అర్హత సాధించారు. ఇప్పటి వరకూ జరిగిన అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం కనబర్చిన రిషి.. తుది పోరులో లిజ్ ట్రస్‌తో పోటీ పడనున్నారు. 1.80 లక్షల మంది కన్జర్వేటివ్ సభ్యుల్లో ఎక్కువ మంది ఎవరి వైపు మొగ్గు చూపితే ప్రధానిగా వారే పగ్గాలు చేపడతారు. సెప్టెంబర్ 5న విజేతను ప్రకటిస్తారు.
రిషి సునక్ తండ్రి భారతీయ డాక్టర్ కాగా.. 1960ల్లో ఆయన ఇంగ్లాండ్ వలస వెళ్లారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని రుషి పెళ్లాడిన సంగతి తెలిసిందే.
బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ దిగిపోవడంతో ఎన్నిక అనివార్యం కాగా ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతున్న బ్రిటన్ను ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడేసే అనుభవం తనకు మాత్రమే ఉందని సునక్ చెబుతున్నారు.