Rishi Sunak:దాని కంటే చనిపోవడమే బెటర్

45
- Advertisement -

కరోనా మహమ్మారిపై బ్రిటన్ ప్రధాని రిషి సునామక్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కంటే చనిపోవడమే బెటర్ అని రిషి సునాక్ చెప్పినట్లు బ్రిటన్ మీడియాలో కథనాలు వెలువడటం ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

కరోనా మహమ్మారితో బ్రిటన్‌ అల్లాడిపోయింది. లాక్ డౌన్ కట్టడికి ఓసారి లాక్‌డౌన్ కూడా విధించింది. తర్వాత మరోసారి కూడా కొవిడ్ విజృంభించడంతో మళ్లీ లాక్‌డౌన్ విధించాలా వద్దా అనేది ప్రభుత్వం, అధికారులు భేటీ అయి సమాలోచనలు జరిపారు. ఆ సమయంలో రెండోసారి లాక్‌డౌన్ విధించడం కంటే కొంతమందిని చనిపోవడానికి అనుమతించడమే మంచిదని రిషి సునాక్ అన్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ విషయాన్ని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అత్యంత సీనియర్ సలహాదారు డొమినిక్ కమ్మింగ్స్ తెలిపారు. లాక్‌డౌన్ విధించడం కంటే కొవిడ్ కారణంగా కొంతమందిని చనిపోవడానికి అనుమతించడం మంచిదని రిషి సునాక్ అన్నారని తెలపగా ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 2019లో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి బ్రిటన్‌లో 2.2 లక్షల మందికి పైగా మరణించారు.

Also Read:KCR:త్వరలో గిరిజన బంధు

- Advertisement -