- Advertisement -
బర్మింగ్ హామ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 98 పరుగులకే 5 వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడగా రిషబ్ పంత్ (146: 111 బంతుల్లో 20×4, 4×6) విధ్వంసక సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. పంత్‌కు తోడు జడేజా కూడా రాణించడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్: 163 బంతుల్లో 10×4), మహ్మద్ షమీ (1 బ్యాటింగ్: 11 బంతుల్లో) ఉన్నారు.
శుభమన్ గిల్ (17), చతేశ్వర్ పుజారా (13) ,హనుమ విహారి (20), విరాట్ కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) విఫలమయ్యారు. అయితే పంత్ – జడేజా జోడి ఆరో వికెట్‌కి 222 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసింది. కెరీర్‌లో ఐదో టెస్టు సెంచరీని నమోదుచేశాడు పంత్.
- Advertisement -