భారత ఎన్నికల సంఘంకు అందించిన గత ఎన్నికల అఫిడవిట్ ల ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుడైన సీఎంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారని… వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అత్యల్ప నికర ఆస్తులు ఉన్నాయని ది ప్రింట్ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆస్తులు రూ.370కోట్లు ఉన్నాయని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఫెమా ఖండూ (రూ.132) కలిగి ఉన్నారని ది ప్రింట్ నివేదిక వెల్లడించింది. మమతా బెనర్జీ అత్యంత పేద సీఎంగా ఉన్నారని…అంతకు ముందు లిస్టులో ఉన్న సీఎం నితీశ్‌కుమార్ రూ.56లక్షలు మాత్రమే కలిగిఉన్నారు. అయితే వీరితో పాటు నేర చరిత మారణాయుధాలు కలిగి ఉన్న సీఎంలు మరియు సొంతంగా వాహనాలు కలిగి ఉన్న సీఎంలను సర్వే చేశారు.
తమాంగ్, ఏక్‌నాథ్ షిండే, ఆదిత్యనాథ్,హేమంత్‌సొరెన్, పుష్కర్ సింగ్ ధామి, ఎన్.బీరెన్ సింగ్, భగవంత్ మాన్, శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు సొంతంగా మారణాయుధాలు కలిగి ఉన్నారని తన నివేదికలో వెల్లడించింది. సిక్కిం సీఎం తమంగ్‌కు రూ.3లక్షల విలువైన బోర్ రివాల్వర్ ఉన్నదని…ఏక్‌నాథ్‌షిండే వద్ద రివాల్వర్ పిస్టల్ కలిసి వాటి సూమారుగా రూ.5లక్షల వరకు ఉంటుందని అంచనా వేసింది.
భారతదేశంలో సీఎంల సతీమణులు కూడా వ్యాపార భాగస్వాములగా ఉన్నారని వెల్లడించింది. వారిలో శర్మ సోరెన్ చౌహాన్ షిండే ఈ సీఎంల కంటే వీరి సతీమణులు ఎక్కువ ధనవంతులని నివేదిక వెల్లడించింది. 30మంది సీఎంలలో ఐదుగురు అవివాహితులేనని తమ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వారు హర్యానకు చెందిన మనోహర్ లాల్ ఖట్టర్, యూపీకి చెందిన యోగి ఆదిత్యనాథ్, ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్, పుదుచ్చేరికి చెందిన ఎన్.రంగస్వామి, వెస్ట్ బెంగాల్ చెందిన మమతా బెనర్జీ. అలాగే బహుళభార్యత్వం కలిగి ఉన్న సీఎం తమంగ్ ఉన్నారు.
దేశంలోని 30మంది సీఎంలలో అస్సాం సీఎం ఒక్క హిమంత బిస్వా శర్మ మాత్రమే తత్వశాస్త్రంలో డాక్టరేట్, రాజనీతి శాస్త్రంలో ఎంఏ మరియు న్యాయశాస్త్రంలో డిగ్రీని కలిగి ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇంజినీర్ల జాబితాలో ఢిల్లీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటకకు చెందిన బసవరాజ్ బొమ్మై, గుజరాత్‌కు చెందిన భూపేంద్ర పటేల్ పట్టభద్రులుగా నమోదు అయ్యారని వెల్లడించింది. అయితే మహారాష్ట్రకు చెందిన ఏక్‌నాథ్‌షిండే మాత్రమే అత్యల్పంగా చదువుకున్న వ్యక్తిగా ఉన్నారు. అతను కేవలం హైస్కూల్ వరకు చదువుకున్నట్టుగా తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి….
బీజేపీది ట్రబుల్ ఇంజన్ సర్కార్..
తెలంగాణలో స్వర్ణ యుగం..
బండి పాదయాత్రకు బ్రేక్.. అంతా కన్ఫ్యూజన్ !