RGV: ఎక్కడికీ పారిపోలేదు.. తప్పు చేస్తే జైలుకెళ్తా

2
- Advertisement -

తాను ఎక్కడికీ పారిపోలేదు.. తప్పు చేస్తే జైలుకెళ్తానని చెప్పారు దర్శకుడు ఆర్జీవీ. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్జీవీ.. చంద్రబాబు, లోకేశ్ ప్రతీకార రాజకీయాలు చేస్తారని అనుకోవడం లేదు అన్నారు. 164 సీట్లతో రికార్డు స్థాయిలో వాళ్లు గెలవడమే అసలైన ప్రతీకారం…నా సినిమాలు, నా పోస్టులు.. ఒక్క ఓటును కూడా ప్రభావితం చేయలేకపోయాయి అన్నారు.

నన్ను వాళ్లు పట్టించుకుంటారని అస్సలు అనుకోవడం లేదు..జగన్ పరిపాలన ఎలా ఉందో కూడా నాకు తెలీదు అన్నారు. కానీ, జగన్ అంటే మొదటి నుంచి అభిమానం ఉందన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లి అక్కడ సినిమా కథలు రాసుకుంటానని చెప్పారు.

ప్రకాశం జిల్లా పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు…వాళ్లు కనీసం నా ఆఫీస్ లోపలికి కూడా రాలేదు అన్నారు. ఏదో జరిగిపోయిందని జనాలంతా ఫోన్ చేసి సానుభూతి తెలియజేస్తుంటే అదంతా వినలేక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాను అని చెప్పారు ఆర్జీవీ.

Also Read:Harish:రబీకి రైతు భరోసా ఏది?

- Advertisement -