అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు: వర్మ

81
dangerous
- Advertisement -

డేంజరస్ సినిమా వాయిదాపై తనదైన శైలీలో స్పందించారు దర్శకుడు వర్మ. ఈ సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాకపోవడంతో డేంజరస్‌ను వాయిదా వేశారు ఆర్జీవీ. అనంతరం తన మార్క్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని… త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

లెస్బియన్ కథగా వర్మ ఈ మూవీని తెరకెక్కించారు. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకుని…. అందరి మనుషులలాగానే లెస్బియన్స్ కూడా మనుషులేనని అందుకే నేను ఈ సినిమా తీశానని చెప్పారు వర్మ. కోర్టు తీర్పు తర్వాత అందరు వాళ్ళ మీద సింపతీ చూపించేలా తెరకెక్కిస్తే.. నేను సాధారణ సినిమాలలో హీరో-హీరోయిన్ల మాదిరే ఇద్దరు లెస్బియన్లగా సినిమా తీశానని తెలిపారు. న్యాయపోరాటం తర్వాత సినిమా రిలీజ్ చేస్తానని తెలిపారు.

లెస్బియన్ సినిమా కావడంతో పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ ప్రదర్శనకు తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మరికొన్ని థియేట‌ర్లు కూడా ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందుకు రాలేదు.

- Advertisement -