ఆర్జీ(వీ)ఆర్‌..రామ్‌ గోపాల్ రెడ్డి

180
Rgv now Ram gopal reddy
- Advertisement -

సందీప్ వంగా దర్శకత్వంలో పెళ్ళిచూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ సాధించిందో అన్నే వివాదాలకు కేరాఫ్‌గా మారింది. సినిమా పోస్టర్‌ దగ్గరి నుంచి లిప్ లాక్ సీన్స్‌ వరకు అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు ఆందోళన బాట చేపట్టిన ప్రేక్షకులు మాత్రం సినిమాను ఆదరించారు. దీంతో చిన్న సినిమాగా విడుదలైన అర్జున్ రెడ్డి భారీ కలెక్షన్స్‌ని సాధించిపెట్టింది.

సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ, కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ మధ్య వార్ కూడా నడిచింది. అయితే, ప్రస్తుతం అర్జున్ రెడ్డి ట్రెండ్ పోయినా ఆ సినిమా జ్ఞాపకాలు ఇంకా వర్మను వదల్లేదు అనుకుంటా. అందుకే తన పేరు ఆర్జీవీ కాకుండా ఆర్జీఆర్‌గా విజయ్‌ చేసిన పోస్టర్‌ని ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేశాడు వర్మ.

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోలా రామ్‌గోపాల్ వ‌ర్మ గ‌డ్డం మీసాల‌తో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అర్జున్ రెడ్డికి తండ్రి ఆర్‌జీఆర్ అని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

- Advertisement -