Rewind 2024: సీక్వెల్స్ సినిమాల్లో హిట్ ఎన్నో తెలుసా?

2
- Advertisement -

2024 తెలుగు ఇండస్ట్రీకి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో టాలీవుడ్‌లో ఎన్నో సీక్వెల్ సినిమాలు రాగా అందులో ఎన్ని హిట్ కొట్టాయి?, ఎన్ని ఫట్ అయ్యాయో ఓ సారి చూద్దాం.

ఈ ఏడాది హిట్ అందుకున్న సీక్వెల్స్ సినిమాలను ఓ సారి పరిశీలిస్తే.. మార్చిలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన సీక్వెల్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. త్వరలో ‘టిల్లు క్యూబ్’ కూడా రానున్న సంగతి తెలిసిందే. ఏంఏం కీరవాణి కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మత్తు వదలరా సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీకి సీక్వెల్ గా ఐదేళ్ల తర్వాత మత్తు వదలరా 2 వచ్చింది. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంది. ఇక అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 గురించి చెప్పాల్సిన పనిలేదు. విడుదలకు ముందే వెయ్యి కోట్లు రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు వసూలు చేసింది.

ఇక ఈ ఏడాది ఫ్లాప్‌ను మూటగట్టుకున్న సీక్వెల్స్ సినిమాలను ఓ సారి పరిశీలిస్తే…ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. పాన్ ఇండియా వైడ్ గా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అలాగే యాత్ర 2చగీతాంజలి 2 ,ప్రతినిధి 2,భామాకలాపం 2 డిజాస్టర్‌లుగా మిగిలాయి.

Also Read:TTD: 12న తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి

- Advertisement -