రివ్యూ: వీర భోగ వసంత రాయలు

422
Veera Bhoga Vasantha Rayalu
- Advertisement -

విలక్షణ సినిమాలకు కేరాఫ్‌ నారా రోహిత్. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ కొంతకాలంగా ఫ్లాప్ సినిమాలతో నిరాశలో ఉన్నారు. తాజాగా డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో ఈ ముగ్గురు హీరోలతో పాటు శ్రియ, శశాంక్‌లు ప్రధాన పాత్రల్లో వీరభోగ వసంత రాయలు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రంతో రోహిత్ ఆకట్టుకున్నాడా..?లేదా చూద్దాం

కథ :

నారా రోహిత్ , సుధీర్ బాబు , శ్రీయ ముగ్గరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ . క్రికెటర్స్‌ తో పాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్న ఓ విమానం హైజాక్‌కు గురవుతుంది. అదే సమయంలో సిటీలో వరుసగా అనాథ పిల్లల కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తాయి. విమాన హైజాక్ కేసును దీపక్‌ (నారా రోహిత్), నీలిమా (శ్రియ) మిస్ అయిన ఇంటి కేసును వినయ్‌ (సుధీర్‌ బాబు) టేకప్‌ చేస్తారు. ఈ రెండు కేసులకు ఉన్న సంబంధం ఏంటి..?వీటిని దీపక్ ఎలా చేధించాడు..?శ్రీవిష్ణు పాత్ర ఏంటీ అనేది తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, నటీనటులు. సుధీర్‌ బాబు,నారా రోహిత్,శ్రీ విష్ణు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నారా రోహిత్ తన డీసెంట్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఎస్ ఐ వినయ్ పాత్రలో నటించిన సుధీర్ బాబు తన నటనతో ఆ పాత్రను రక్తికట్టించాడు.విలన్‌గా శ్రీ విష్ణు మంచి నటనను కనబర్చాడు. చివరి 15 నిముషాల్లో వచ్చే సన్నీ వేషాలు బాగున్నాయి. మిగితా వారు తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Image result for veera bhoga vasantha rayaluమైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ స్లో నేరేషన్,లాజిక్ లేని సన్నివేశాలు. దర్శకుడు ఇంద్రసేన రాసుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని తెర మీద కు తీసుకరావడంలో విఫలం చెందాడు.చాలా చోట్ల లాజిక్ లేకుండా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, సంగీతం బాగుంది. సినిమాకు నిర్మాణ విలువలే ప్రధాన సమస్యగా మారాయి. దీంతో క్వాలిటీ పరంగా నిరాశపరుస్తుంది.

తీర్పు:

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం వీర భోగ వసంత రాయలు. కథ, నటీనటులు సినిమాకు ప్లస్ పాయింట్‌కాగా లాజిక్ లేని సన్నివేశాలు, స్లో నేరేషన్ మైనస్ పాయింట్స్‌. ఓవరాల్‌గా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోని చిత్రం వీర భోగ వసంతరాయలు.

విడుదల తేదీ:26/10/18
రేటింగ్: 2/5
నటీనటులు : సుధీర్‌ బాబు, నారా రోహిత్, శ్రీ విష్ణు, శ్రియ
సంగీతం : మార్క్‌ కె రాబిన్‌
నిర్మాత : అప్పారావు
దర్శకత్వం : ఆర్‌ ఇంద్రసేన

- Advertisement -