Harishrao:బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు

53
- Advertisement -

బిజెపి లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రి ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత పాలకుల వివక్షకు గురై వెనుకబడిన ఈ ప్రాంతం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. రేవంత్ రెడ్డి ఒక్క సర్కారు దవాఖాన తీసుకురాలేదు అన్నారు.

మా ప్రభుత్వం 3 ఆసుపత్రులు కొడంగల్ నియోజక వర్గానికి మంజూరు చేసిందన్నారు. కొడంగల్ లో 46 తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని… నారాయణ్ పేట్ లో 180 కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేశాం అన్నారు. ఇక్కడి ప్రజల మంచి నీటి కష్టాలు తీర్చింది కేసీఆర్ అన్నారు. నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఇంటింటికీ నల్లా వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఉంటే పదేళ్లు అయినా మంచి నీళ్ళు రాకపోతుండేనని…సీఎం గారు పాలమూరు ప్రాజెక్ట్ ప్రారంభించారు అన్నారు.

కృష్ణా నీళ్ళు నార్లాపుర్ వచ్చాయి. ఏడాది లోపల మీ పొలం వాకిళ్ళకు నీళ్ళు వస్తాయి. మీ కాళ్ళు కడిగి రుణం తీర్చుకుంటాం అన్నారు. మాటలు కావాలంటే రేవంత్ రెడ్డి దిక్కు, అభివృద్ధి కావాలంటే నరేందర్ రెడ్డి దిక్కు అన్నారు. మొత్తం లక్షా 50 వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం…వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే, 24 గంటల కరెంట్ దండగ అని రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి అన్నడన్నారు. మూడు గంటల కరెంట్ చాలు అని కడుపులో ఉన్న విషం బయట పెట్టిండని…మూడు గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్, 24 గంటల కరెంట్ కావాలంటే బిఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు. ఇక్కడ పని చేయలేదని ఓడ గొడితే, మల్కాజ్ గిరికి పోయిండు. అక్కడ ఏం పని చేయలేదన్నారు. కర్ణాటకలో మూడు రోజులకు ఒకరోజు నీళ్ళు, అక్కడ పింఛన్లు 600, ఇక్కడ 2000 అన్నారు.

Also Read:లవర్స్‌ని థ్రిల్ చేయనున్న”తంతిరం”

బిజెపి లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు… హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బిఆర్ ఎస్ గెలుపు అని తెలుస్తుందని…గెలిచేది, వచ్చేది బిఆర్ఎస్ పార్టీ ఇందులో ఎలాంటి డౌట్ లేదు అన్నారు. వెనుకబడ్డ ప్రాంతానికి కృష్ణా జలాలు తెచ్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని…ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సుప్రీం కోర్టు కూడా విచారణ జరగాలని స్పష్టం చేసిందన్నారు. ఓటుకు నోటు కేసులో విచారణ అయ్యేది ఖాయం,రేవంత్ జైలుకు వెళ్లేది ఖాయం అన్నారు.

- Advertisement -