రజనీతో అమితాబ్ – కమల్!

33
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘Thalaivar170’ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయినట్లు మేకర్స్‌ వెల్లడించారు. ఈ మేరకు సూపర్ స్టార్‌ క్లాస్సీ లుక్‌ను రిలీజ్‌ చేశారు. మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే, 32 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కలిసి నటించబోతున్నారు. రజనీ నటిస్తున్న ఈ తలైవర్ 170వ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, మలయాళ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

కాగా, ఇందులో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇప్ప‌టికే హీరోయిన్లుగా రితికా సింగ్, దుషారా విజ‌య‌న్, మంజు వారియ‌ర్‌ను ప్ర‌క‌టించగా ఓ కీల‌క పాత్ర కోసం మరో స్టార్ ను కూడా తీసుకున్న‌ట్లు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశారు. అనిరుధ్ ర‌విచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌నుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ జీవితంలోనే ఈ సినిమాను ప్రత్యేకంగా తీయాలని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. అలాగే కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి కమల్ హాసన్ కూడా రజనీకాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే.. అంతకుమించిన విశేషం మరొకటి ఉండదు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:లవర్స్‌ని థ్రిల్ చేయనున్న”తంతిరం”

- Advertisement -