బీజేపీ బాబు మోహన్ బూతు పురాణం..

27
- Advertisement -

బీజేపీ నేతల దాష్టికాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు, వారి తనయులు గుండాల్లాగా ప్రవర్తించి ప్రజల్లో విమర్శల పాలవుతుండగా తాజాగా మాజీ మంత్రి,బీజేపీ నేత బాబు మోహన్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఏకంగా ఆ పార్టీ కార్యకర్తనే బండ బూతులు తిట్టగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏకంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నే బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫోన్ లో ఓ బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయారు. ఆదోల్ నుంచి వెంకట రమణ అనే ఓ బీజేపీ కార్యకర్త బాబూమోహన్ కు ఫోన్ చేసి సార్ నేను మీతో కలిసి పార్టీ కోసం పనిచేద్దామనుకుంటున్నాను అన్నారు. దీంతో నువ్వెంత నీ బతుకెంత నాతో కలిసి పనిచేస్తావా? నేనెవరు నీకు తెలుసా? నేను ప్రపంచ స్థాయి నాయకుడిని..అటువంటి నాతో కలిసి పనిచేస్తావా? చెప్పుతో కొడతా అంటూ రెచ్చిపోయారు.

బండి సంజయ్ ఎవడ్రా వాడు నా తమ్ముడు అంటూ నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ కార్యకర్తను హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -