చరణ్ మళ్లీ స్టార్ట్ చేస్తున్నాడు

22
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – విజువల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘RC 15’. లాస్ట్ షెడ్యూల్ వరకు ‘RC 15’ షూటింగ్ శరవేగంగా జరిగింది. కానీ, లాస్ట్ షెడ్యూల్ తర్వాత చరణ్ ఈ సినిమాకి గ్యాప్ ఇచ్చాడు. దాంతో, మెగా ఫ్యాన్స్ ఈ సినిమా షూట్ ఎప్పుడు అంటూ మెసేజ్ లు చేస్తున్నారు. ఇప్పుడు వారందరికీ ఓ గుడ్ న్యూస్. ఈ సినిమా తర్వాత షెడ్యూల్ ఈ నెల 9వ తేదీ నుంచి స్టార్ట్ కానుంది. 9న నుంచి హైదరాబాద్ లో పాటను చిత్రీకరించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

కాగా స్టార్ట్ కానున్న షెడ్యూల్ హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడని టాక్. రాజకీయ డ్రామా అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగుతుంది అనుకునేరు. కేవలం ప్లాష్ బ్యాక్ మాత్రమే సీరియస్ డ్రామా అట. ఇక మిగిలిన పార్ట్ మొత్తం శంకర్ ఎంటర్ టైన్ గానే సినిమాని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమా మొదట ఫ్యామిలీ డ్రామా అన్నారు. కానీ.. ఇది కూడా పొలిటికల్ డ్రామా అని తెలిసే సరికి ఫ్యాన్స్ కి సినిమా పై ఆసక్తి మరింతగా రెట్టింపు అయింది. కారణం.. పొలిటికల్ డ్రామాలను శంకర్ అద్భుతంగా హ్యాండిల్ చేయగలడు. అందుకే.. ఈ సినిమా పై మొదటి నుంచి పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -