జుడాల సమ్మె…నిధుల విడుదల

4
- Advertisement -

ఉస్మానియా, గాంధీ, కాకతీయ వర్సిటీలకు కలిపి 204.85 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. జూడాల సమ్మె నేపథ్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజి లో లేడీస్ హాస్టల్ నిర్మాణానికి 80 కోట్లు విడుదల చేసింది.

ఉస్మానియా మెడికల్ మేన్స్ హాస్టల్ కి 50 కోట్లు, డెంటల్ హాస్టల్ కి 6 కోట్లు, బాయ్స్ హాస్టల్ పునరుద్ధరణ, మరమ్మతులకు 50లక్షలు విడుదల చేసింది. ఉస్మానియా లేడీస్ హాస్టల్ వద్ద సిసి రోడ్ ల పునరుద్ధరణకు 40 లక్షలు, మొత్తం ఉస్మానియా వసతి బిల్డింగ్ లు,, రోడ్ లకు 121.90 కోట్లు విడుదల చేసింది.

గాంధీ కి మొత్తం 79.50 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. గాంధీ మెడికల్ కాలేజీలో లేడీస్ హాస్టల్ నిర్మాణానికి 42 కోట్లు, గాంధీ మెన్స్ హాస్టల్ నిర్మాణానికి 23 కోట్లు,గాంధీ లో ఎస్ ఆర్ బ్లాక్ హాస్టల్ నిర్మాణానికి 14.50 కోట్లు, కాకతీయ యూనివర్సిటీలో సిసి రోడ్ లకు 2.75 కోట్లు కేటాయించారు.

Also Read:Kaushik Reddy:పొన్నం నుండే బ్లాక్ బుక్‌ స్టార్ట్

- Advertisement -