తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు వివిధ పార్టీల నాయకులు కరోనా నిబంధనల మధ్య గణతంత్ర వేడుకలను నిర్వహించారు. హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.
ప్రతి ఉద్యోగి ప్రజాస్వామ్య పద్దతిలో పనిచేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మొట్టమొదటి సారి 73వ గణతంత్ర వేడుకల్లో సీపీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ , అంబెడ్కర్ చిత్ర పాటలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు చైర్మన్ జస్టీస్ చంద్రయ్య. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైద్రాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు హైదరాబాద్ కలెక్టర్ ఎల్.శర్మన్. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 73 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వందన స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డిసిపి రక్షిత మూర్తి , కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమ మహేశ్వరరావు, మునిసిపల్ చైర్మన్ కుసంపూడి మహేష్. ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. 73 వ రిపబ్లిక్ డే సందర్భంగా మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయం లో జెండా ఎగుర వేసి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మల్లారెడ్డి. ప్రతి ఒక్కరు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి అన్నారు.