టైగర్ బయోపిక్‌తో రేణు దేశాయ్ రీ-ఎంట్రీ..

227
- Advertisement -

సినిమాలకు దూరమైన హీరోయిన్లు రీ-ఎంట్రీ ఇవ్వడం సాదరనమే. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అదే రూట్‌లో తెలుగు తెరపై మరోసారి మెరవడానికి రెడీ అవుతోందని వార్తలు వస్తున్నాయి. రేణు దేశాయ్ తెలుగులో చేసింది రెండు సినిమాలే.. ఆ రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు. ఆ తర్వాత పవన్‌ను పెళ్లి చేసుకోవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక పవన్‌ రేణు దేశాయ్‌ విడిపోయిన విషయం తెలిసిందే.

Renu Desai

2014 లో ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠి సినిమాకు దర్శకత్వం కూడా వహించారు రేణు దేశాయ్‌. అలాంటి రేణుదేశాయ్ తెలుగులో ఒక సినిమాలో కీలకమైన పాత్రను చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా దర్శకుడు వంశీకృష్ణ ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. ఇది ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో హీరోకి అక్క పాత్రలో రేణు దేశాయ్ నటించనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దర్శక నిర్మాతగా సక్సెస్ కాకపోవడం వల్లనే తిరిగి ఆమె నటన వైపు దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే తల్లి పాత్రలతో నదియా.. ఖుష్బూ.. రమ్యకృష్ణ వంటి సీనియర్ హీరోయిన్స్ బిజీ అయ్యారు. ఇక స్నేహా .. భూమిక వదిన పాత్రల్లో మెప్పిస్తున్నారు. రేణు దేశాయ్ కూడా బిజీ అవుతుందేమో చూడాలి మరి.

- Advertisement -