న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా-ఆసీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతేకాదు ఇందోర్‌లో జరిగే మూడో టెస్ట్‌ను భారత్ గెలుచుకుంటే…ప్రపంచంలో టెస్ట్‌ల్లో టాప్ ర్యాంక్‌తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ చేరుకొనుంది. 113పరుగుల విజయ లక్ష్యం కోసం భారత్ 26.4ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ 262పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఒక్క పరుగు ఆధిక్యంలో బ్యాటింగ్ ఆసీస్ 113పరుగులకే కుప్పకూలింది. అనంతరం 115పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్…113పరుగుల విజయ లక్ష్యం కోసం భారత్ 26.4ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
మొదట్లో తడబడ్డ భారత్ కెప్టెన్ రోహిత్ (31) ఆదుకున్న కేఎల్ రాహుల్ విరాట్ నిరాశపరిచారు. ఈ క్రమంలో వచ్చిన పుజారా శ్రీకర్ భరత్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. మార్చి1 నుంచి ఇందోరో వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి…
స్పిన్ మాయాజాలం..నాగ్‌పూర్ మనదే
ఆసీస్ 113 ఆలౌట్..భారత్ టార్గెట్ 115
ఆసియా ప్రెసిడెంట్ కప్‌ను ముద్దాడిన భారత్