CJP నేతలకు కోర్టులో ఊరట

1
- Advertisement -

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు కోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ పోలీసులు ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్న ఈ ముగ్గురిని ఆదివారం కోర్టు విడుదల చేసింది. జంతర్ మంతర్‌లో వీరు చేపట్టనున్న ఆందోళన రెండో రోజు ప్రారంభం కావడానికి ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.

శనివారం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టడానికి ముందు పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రెండో రోజు నిరసనకు ముందు వారిని ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) ఎదుట హాజరుపరిచారు.భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), 2023లోని సెక్షన్ 126 (శాంతిభద్రతల పరిరక్షణకు హామీ), సెక్షన్ 170 (కాగ్నిజబుల్ నేరాల నివారణ కోసం అరెస్టు) కింద చర్యలు తీసుకుని ముందస్తు నిర్బంధంలో ఉంచినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.తమ నాయకుల విడుదలపై సీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “బొద్దింకలు ఎప్పటికీ చనిపోవు” అని వ్యాఖ్యానించింది.

దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతామని సీజేపీ గతంలో ప్రకటించింది. అయితే, ఈ ఆందోళనకు ముందు ఢిల్లీ పోలీసులు 7,000 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంతో కార్యక్రమానికి ఆటంకం ఏర్పడింది.అదుపులోకి తీసుకున్న వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత మమతా బెనర్జీ, సీపీఐ(ఎం) నేతలు పినరయి విజయన్, మాణిక్ సర్కార్ వంటి నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read;బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్‌

- Advertisement -