శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

1
- Advertisement -

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో నేటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఉత్సవాలు వైభవంగా కొనసాగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు.

మహోత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు భ్రమరాంబాదేవి ఆలయంలో అంకురార్పణ పూజలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు భృంగి వాహనంపై స్వామివారు, అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.

Also Read:బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్‌

ఉత్సవాల నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే ఆర్జిత హోమాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఉత్సవాలు ముగిసే వరకు ఈ ఏర్పాట్లు అమల్లో ఉంటాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -