జియో వినియోగదారులకు శుభవార్త..

474
jio
- Advertisement -

ప్రముఖ టెలికం సంస్థ జియో తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా వై-ఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చని జియో ఈ సందర్భంగా పేర్కొంది. భారత దేశంలో ఉన్న ఏ వైఫై నెట్‌వర్క్‌ నుంచైనా ఈ సర్వీస్‌ పనిచేయనుంది. ప్రసుత్తం 150 రకాల స్మార్ట్‌ ఫోన్లలో ఈ వైఫై ద్వారా వాయిస్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చని పేర్కొంది. వైఫై కాలింగ్‌ సౌలభ్యం దేశ వ్యాప్తంగా జనవరి16 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్‌ సపోర్ట్‌ చేస్తుందో లేదో అన్నది తెలుసుకునేందుకు jio.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ జియో వైఫై కాలింగ్‌ ఉపయోగించాలంటే.. స్మార్ట్‌ఫోన్లలో సెట్టింగ్స్‌‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఫోన్‌లోని వై-ఫై సెట్టింగ్స్‌లోకి వెళ్లి కాలింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సేవల వల్ల మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని సమయంలోనూ కాల్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.. ఈ సేవల కోసం అదనంగా ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని వివరించింది.

కాగా, భారతీ ఎయిర్‌టెల్ ఇటీవలే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి పోటీగా జియో కూడా ఈ సేవలను అందుబాటులో తెచ్చింది. కాగా, ఇంతకు ముందు ఎయిర్‌టెల్‌ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, ఏపీలో మాత్రమే ‘ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌’ పేరుతో కస్టమర్లకు సర్వీసులను అందించింది. అయితే తాజాగా జియో మాత్రం ఫ్రీ వైఫై కాలింగ్‌ సర్వీసులను.. దేశవ్యాప్తంగా కల్పించనుంది.

- Advertisement -